ఊహించిందే జరిగింది, మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తో నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సరికొత్త...
ఊహించిందే జరిగింది, మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తో నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలుకొట్టాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సరికొత్త సంచలనం సృష్టించిన విషయం తెలిసినదే. నాన్-బాహుబలి చిత్రాలలో శ్రీమంతుడు నెం 1 గా నిలిచింది. అయితే తాజాగా ఆ రికార్డు మెగాస్టార్ ఖైదీ నెం 150 బద్దలు కొట్టింది.
సంక్రాంతి కానుకగా ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల సునామి ని సృష్టిస్తోంది. కేవలం 12 రోజుల్లోనే 85 కోట్ల షేర్ ను రాబట్టి శ్రీమంతుడు రికార్డు ని బద్దలుకొట్టింది. దీంతో నాన్-బాహుబలి రికార్డులన్నీ బద్దలుకొట్టిన మెగా ఖైదీ టాలీవుడ్ లో టాప్ 2 వ స్థానం లో నిలిచింది.
ఇప్పటికే వరల్డ్ వైడ్ గా 150 కోట్ల గ్రాస్ వాసులన్నీ సాధించిన చిరు 200 కోట్ల దిశగా దూసుకుపోతున్నాడు. 150 కోట్ల గ్రాస్ ని 85 కోట్ల కు పైగా షేర్ ని సాధించి సంచలనం సృష్టించిన ఖైదీ లాంగ్ రన్ లో బాహుబలి రికార్డులని కూడా బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
మెగా అభిమానులంతా ఖైదీ నెం 150 రికార్డుల పైనే చర్చించుకుంటున్నారు. తమ అభిమాన హీరో రీఎంట్రీ అనే పెద్ద వరంగా భావిస్తున్న తరున్నంలో పాత రికార్డులన్నీ బద్దలుకొట్టి కొత్త రికార్డులని సాధించడం నిజంగా టాలీవుడ్ చరిత్రనే తిరగరాసిందని చెపుతున్నారు.
ఇపుడు చిరంజీవి తర్వాత సినిమా ఏ విధంగా ఉండబోతుందో అనే దానిపయినా కూడా అభిమానుల్లో చర్చ మొదలయింది. మొత్తానికి చిరంజీవి కొత్త రికార్డే సృష్టించాడు.



No comments