Page Nav

HIDE

Grid

GRID_STYLE

Hover Effects

TRUE

Classic Header

{fbt_classic_header}

Header Ad

//

Breaking News:

latest

Ads Place

ఖైదీ నెంబర్ 150: ట్రేడ్ మార్కెట్ అంచనాలు తలక్రిందులు అయ్యాయా?

పది యేండ్ల తర్వాత తిరిగి వచ్చిన చిరంజీవిని జనం ఎలా ఆదరిస్తారో కూడా తెలియని సమయంలో కోట్లకి కోట్లు పెట్టుబడి పెట్టి రైట్స్ తీసుకుంటూ ఉంటె...


పది యేండ్ల తర్వాత తిరిగి వచ్చిన చిరంజీవిని జనం ఎలా ఆదరిస్తారో కూడా తెలియని సమయంలో కోట్లకి కోట్లు పెట్టుబడి పెట్టి రైట్స్ తీసుకుంటూ ఉంటె ఈ బయర్ లకి మతి కానీ పోయిందా!! అన్నట్లు చూసారు. ఈ పిచ్చితనం వళ్ళ నష్టపోతారంటూ ట్రేడ్ పండితులు సయితం హెచ్చరించారు.

అయితే మెగాస్టార్ స్టామినా ఏంటనేది అంచనా వేయడం ట్రేడ్ వళ్ళ కాలేదన్నది ఖైదీ నెంబర్ 150 క్లియర్ గా చూపిస్తుంది. ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయితే గొప్ప అనుకున్న ఈస్ట్ గోదావరి ఏరియా లో కేవలం 5 రోజుల్లో బయ్యర్స్ బ్రేక్ ఈవెన్ అయిపోయారు.






5 రోజుల్లో 5.36 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్ లని ఆల్రెడీ లాభాల బాట పటించింది. 6 వ రోజు కూడా అద్భుతమయిన షేర్ వస్తుందని కలెక్షన్ ట్రెండ్ చెప్తుంది. ఇప్పటి నుండి సడన్ గా డ్రాప్ అయినా కానీ కనీసo రెండు కోట్ల లాభం చూడకుండా ఉండదని, ఈస్ట్ గోదావరి తో పాటు కృష్ణ, వెస్ట్, గుంటూరు జిల్లాలో వచ్చే 4,5 రోజుల్లో బయ్యర్లంతా సేఫ్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి.

జాతారని తలపించేలా వచ్చిపోతున్న జన వాహిని చూసి ఈ చిత్రాన్ని ఎక్కువ అంచనా వేసిన వారిని సయితం ఈ స్థాయి మాత్రం ఊహించలేదని అంగీకరిస్తున్నారు. చాల ఏరియాలో తోలి వారం రికార్డులని అధిగమించిన ఈ చిత్రం సినీ రంగంలో చిరంజీవి ఆధిపత్యం ఎలాంటిదనేది ఒక స్పష్టమయిన అవగాహనని ఇస్తోంది.

No comments

Ads Place