ఖైదీ నెం 150 సినిమా విడుదలయిన రోజు నుండి రికార్డ్స్ బద్దలుకొడుతూనే ఉంది. బాస్ రీఎంట్రీ నే కాదు రికార్డ్స్ ఎంట్రీ కూడా అనేంతగా దూసుకుపోతు...
ఖైదీ నెం 150 సినిమా విడుదలయిన రోజు నుండి రికార్డ్స్ బద్దలుకొడుతూనే ఉంది. బాస్ రీఎంట్రీ నే కాదు రికార్డ్స్ ఎంట్రీ కూడా అనేంతగా దూసుకుపోతుంది. మరి పది సంవత్సరాల తర్వాత వచ్చిన చిరంజీవి ఖైదీ నెం 150 తో సృష్టించిన పది రికార్డులు అభిమానుల కోసం.
1. ఇంతవరకు టాలీవుడ్లో ఏ రీమేక్ సినిమాకి కూడా ఇంతలా సూపర్ హిట్ అయ్యి రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించలేదు, దీనితో ఖైదీ నెం 150 సినిమా ఆ ఘనతను దక్కించుకుంది.
2. ఒకే భాషలో రిలీజ్ అయి USA ప్రీమియర్ షో కలెక్షన్స్ లో ఖైదీ నెం 150 $ 1.25 మిలియన్ డాలర్స్ వాసులు చేసిన తొలి తెలుగు సినిమా గా చరిత్ర సృష్టించింది.
3. మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 30 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్స్ కి ఎక్కింది.
4. తెలుగు చిత్రాల్లో అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా చరిత్ర సృష్టించింది.
5. ఆఫీసియల్ రికార్డ్స్ ప్రకారం విజయ్ నటించిన తమిళ్ కత్తి సినిమా 12 వ రోజున 100 కోట్ల క్లబ్ లో చేరితే ఖైదీ నెం 150 5 రోజులకే 100 కోట్ల క్లబ్ లో చేరింది.
6. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది ఖైదీ నెం 150.
7. యూట్యూబ్ లో ఖైదీ నెం 150 పాటలు మొత్తం వ్యూస్ ఇప్పటికే దాదాపు 4.5 కోట్లు, ఇంత తక్కువ వ్యవధిలో అన్ని వ్యూస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.
8. భారత దేశం లో టాప్ 10 హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల జాబితాలో 41.75 కోట్ల కలెక్షన్స్ తో టాప్ 8th పోసిషన్ ని కైవసం చేసుకుంది ఖైదీ నెం 150.
9. పది సంవత్సరాల తర్వాత కూడా అదే జోష్ అదే గ్రేస్ తో నటించి మేపించడం చిరంజీవి కి మాత్రమే సాధ్యం అయింది అని చెప్పడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
10.చివరిగా బాస్ ఈస్ బ్యాక్ అంటూ ఖైదీ నెం 150 రిలీజ్ అయితే, పది సంవత్సరాల తర్వాత కూడా మెగస్టార్ పై అభిమానం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటూ, బాక్స్ ఆఫీస్ కి బాస్ నువ్వే అనేలా కలెక్షన్స్ ని గిఫ్టుగా ఇచ్చారు సినీ అభిమానులు. ఇది భారత దేశ చలన చిత్ర చరిత్రలో నే ఓ అరుదయిన రికార్డుగా నిలిచిపోయింది.



No comments