ఇప్పుడు మేము చెప్పబోయే విషయం మెగాస్టార్ చిరంజీవి పై అభిమానులు పెంచుకున్న మమకారమే... చిరు అభిమానులు చెప్తున్నా మాటలనే వాళ్ళా వెర్షన్ ల...
ఇప్పుడు మేము చెప్పబోయే విషయం మెగాస్టార్ చిరంజీవి పై అభిమానులు పెంచుకున్న మమకారమే... చిరు అభిమానులు చెప్తున్నా మాటలనే వాళ్ళా వెర్షన్ లోనే మీకు అందిస్తున్నాము. ఒక చిన్న అంకితభావం తో చిరంజీవి గారికి
ఎం రాసిన ఓం తో మొదలుపెట్టాలంటారు పెద్దలు. అసలు ప్రపంచం లో సినిమా అనేది ఒకటుందని ప్రపంచాన్ని అమ్మ పరిచయం చేసినట్టే సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసింది చిరు నే అంటారు చిరు అభిమానులు. అదేంటంటే కాస్త కుప్పిగంతులు వేసినా, చిన్నపాటి డాన్సులు వేసినా, ఎవరితోనయినా దెబ్బలాడటానికి వెళ్లినా అందరు అనే ఒకే ఒక్క మాట "నువ్వు ఏమయినా పెద్ద చిరంజీవి వి అనుకుంటున్నావా ?" అని. అయితే ఎవరు ఈ చిరంజీవి అని అడిగినప్పుడు అభిమానులు చెప్పేది ఒకటే, ఇంకా సరిగ్గా ఊహ కూడా తెలియని టైం సరిగ్గా అలంటి రోజుల్లోనే టిక్కెట్లు దొరుకుతాయో లేదో అని కంగారు పడ్తున్న రోజుల్లో ఆటో వాడిని తొందరగా పోనీ అంటూ కంగారు పెడ్తు, అరుపులు, కాకలు, ఈలలు, గోలలు మధ్యే ఎలాగూ ఆలా థియేటర్ లోపలికి ఎంటర్ అవ్వడం అంత తెలియకుండా హాల్ లో జరిగిపోయేది. ఈ అరుపులకి కేకలకు కారణం చిరంజీవి అని, ఆ కేకలకు కారణం అభిమానం అని ఆ క్షణమే తెలిసిందంటారు అభిమానులు.
త్రివిక్రమ్ గారు చెప్పినట్లుగా 150 సినిమాల వల్ల అన్నయ ఇచ్చింది కేవలం ఆనందం మాత్రమే కాదు, సినిమాలు మాత్రమే కావొచ్చు కానీ అయన ఇచ్చిన జ్ఞాపకాలు ఒకటి రెండు కాదు మర్చిపోలేనన్ని.
చిన్నపుడు ఆడిన ఆటల్లో కూడా, ఎవరెవరితో ఆడమో గుర్తులేదు గాని చిరంజీవి అంటే 1000, బాలకృష్ణ అంటే 750, నాగార్జున అంటే 500, వెంకటేష్ అంటే 250 అని ఆడిన చీటీల ఆట మాత్రం గుర్తుండిపోయింది అంటారు అభిమానులు. ఇంకా ఇంటర్ లో హాస్టల్లో జాయిన్ అయ్యే రోజుల్లో స్కూల్ లో ఏమి చదువుకున్నామో గుర్తులేదు కానీ చిరు సినిమా రిలీజ్ డే రోజు మాత్రం "ట్విన్కేల్ ట్విన్కేల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్" అన్న రైహ్మ్ గుర్తుంది పోయిందంటారు అభిమానులు.
అభిమానులు ఇది 150 వ సినిమా కాబట్టి స్పెషల్ కాదు, ఇందులో చిరు ఉన్నారు కాబట్టి స్పెషల్ అంటున్నారు. హిట్ ప్లాప్ రీమేక్ ఫ్రీమేక్ ఏదయితే మాకేంటి అందులో చిరు ఉన్నంతవరకు. అరె ఇంత చెప్తున్నారు పాలిటిక్స్ లో ఫెయిల్ కదా ఇంకా ఉందా అభిమానం అంటే తెల్లవారకు ముందే ఊపిరి కూడా ఆడని లైన్లో నిలబడి చిరిగినా చొక్కాలతో లాఠీ దెబ్బలు తిని సంపాదించినా టికెట్ తో చుస్తే వచ్చిన అభిమానం ఇది అంత ఈజీగా పోదు అంటారు చిరు అభిమానులు.
ఇంకా చిరు అభిమానులు ఏమంటున్నారంటే, ఈ జనరేషన్ పిల్లలకి చిరంజీవి అంటే తెలియకపోవొచ్చు వాళ్ళని ఇపుడు ఏ హీరో బెస్ట్ అంటే ఒకరిని యాక్టింగ్ లో బెస్ట్ అని, ఒకరిని ఫైట్స్ లో బెస్ట్ అని, ఒకరిని డాన్స్ లో బెస్ట్ అని చెప్తారు. కానీ ఒక్కపుడు వీటిలో ఏది అడిగిన ఒక్కడి పేరే చెప్పేవాళ్ళం. ఒక్కో దానికి ఒక్కొక్కరు ఉన్నారని రెఫెరెన్సులు ఇచ్చే ఈరోజుల్లోనే అపుడు అన్నిటికి రిఫరెన్స్ చిరంజీవి అంటారు అభిమానులు.
అసలు చిరంజీవి అంటే ఏంటి అని ప్రశ్నిస్తే పాతికేళ్ళపాటు తనతో పాటు కాంటెంపోరరిస్ అందరిని వెన్నక్కు నెట్టి నెంబర్ వన్ పోసిషన్ అనే ఆలోచన కూడా రాకుండా చేసిన హీరో చిరంజీవి అంటారు. ఒక పదేళ్లు ఆ సీట్ నుండి పక్కకు జరిగిన ఇప్పటికి ఎవరు కూర్చోలేకపోయిన పోసిషన్ చిరు దే అంటారు.
సినిమాలో పాటల్ని ఒక పాటలుగా వాడుకునే రోజుల్నుంచే పాటలకోసమే జనాల్ని కేవలం థియేటర్స్ కి రప్పించిన హీరో చిరు అంటారు. ఖైదీ 150 కి టాక్ తో సంబంధం లేదు, సినిమా ఎలా ఉందనేది కాదు, సినిమాలో ఎవరు ఉన్నారనేదే మేటర్ అంటారు చిరంజీవి అభిమానులు.
లైఫ్ లో కొన్ని గుర్తు పెట్టుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని అస్సలు మర్చిపోలేనివి కూడా ఉంటాయి, అందులో చిరు ఒకరు అంటారు అభిమానులు. సింపుల్ గా చెప్పాలి అంటే 90's లో చిరంజీవి అంటే జస్ట్ నాట్ ఆ హీరో, హి ఐస్ అన్ ఎమోషన్ అంటారు. East or west Chiranjeevi is best అని పదేళ్ల క్రితం వినిపించిన మాట ఇప్పుడు మల్లి వినిపిస్తోందని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. అస్సలు ఈ సంక్రాంతి కి ఒచ్చింది జస్ట్ మూవీ కాదు, మా మెమోరీస్...
అయినా మా చిన్నతనం నడుచుకుంటూ మల్లి థియేటర్స్ కి వస్తుంటే ఎగబడి వెళ్ళిపోతాం కానీ టాక్ కనుక్కొని వెళ్తామా అంటున్నారు అభిమానులు. ఏదయితే నెం ఖైదీ నెంబర్ 150 రికార్డు కలెక్షన్స్ తో ఈ సంక్రాంతి కి అలరించిందని చెప్పాలి.



No comments