Page Nav

HIDE

Grid

GRID_STYLE

Hover Effects

TRUE

Classic Header

{fbt_classic_header}

Header Ad

//

Breaking News:

latest

Ads Place

ఖైదీ నెంబర్ 150 - చిరంజీవి సినిమా 150 కోట్ల వైపు పరుగు

చిరంజీవి తానూ "మెగాస్టార్" అని మరో సారి నిరూపించుకున్నారు. ఇప్పటికే ఖైదు నెం 150 బాక్స్ ఆఫీస్ వద్ద Rs.120 కోట్లు కొల్లగొట్టేస...


చిరంజీవి తానూ "మెగాస్టార్" అని మరో సారి నిరూపించుకున్నారు. ఇప్పటికే ఖైదు నెం 150 బాక్స్ ఆఫీస్ వద్ద Rs.120 కోట్లు కొల్లగొట్టేసింది.

మెగాస్టార్ చిరంజీవి వెండి తెరపయి ఖైదీ నెం 150 తో రీఎంట్రీ ఇచ్చారు, అది బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని బద్దలు కొడ్తుంది. రిపోర్టుల ప్రకారం, ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే 120 కోట్ల నెట్ దాటేసింది. ఒక స్టేట్మెంట్ లో అల్లు అరవింద్, ఇది మొదటి వారం లో నే 100 కోట్ల గ్రాస్ దాటింది అని వెల్లడించారు.

Also Read: పాపం బుడ్డోడికి చిరంజీవి అంటే ఇప్పుడు తెలిసినట్టుంది
Also Read: బాలకృష్ణ: నాకు చిరంజీవి తరవాతే ఎవరయినా

ఇంకా, ప్రపంచవ్యాప్తంగా ఇది 108.48 కోట్ల గ్రాస్ ని ఇది మొదటివారం లోనే చేరుకుంది, అని అన్నారు.


ఈ సినిమా, ఫాన్స్ నుండి అద్భుతమయిన రెస్పాన్స్ తో మొదటి రోజునే 47 కోట్లు వసూల్ చేసింది, ఇది ఒక వర్కింగ్ డే రోజు కావడం విశేషం. రెండవ రోజు గౌతమీపుత్ర శాతకర్ణి తో పోటీ పడి ఇది 20 కోట్లు బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొట్టేసింది. ఖైదీ నెం 150 ఓవర్సీస్ మార్కెట్ లో 15 కోట్లు వసూల్ చేసింది.



బాహుబలి 100 కోట్లు కేవలం రెండు రోజుల్లో నే వసూల్ చేసింది, కానీ ఖైదీ నెం 150 మాత్రం 5 రోజులు తీసుకుంది. దీనికి కారణం కూడా ఉంది, బాహుబలి కి అప్పుడు టాలీవుడ్ లో పోటీగా వేరే తెలుగు సినిమా విడుదల అవ్వలేదు. కానీ ఖైదీ నెం 150 కి గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలయి చాల థియేటర్స్ ని లాగేసుకుంది.

ఖైదీ నెం 150 ఇపుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వద్ద స్థిరంగా ఉంది, దీనిని పరిగణంలోకి తీసుకుంటే, చిరంజీవి నటించిన ఈ చిత్రం, తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అతి పెద్ద గ్రాస్ సినిమా గా అవుతుంది.


సినిమా నిర్మాత అయిన రామ్ చరణ్, తానూ ఎంతో సంతోషంగా ఉన్నాడని, ఈ చిత్రం తన హృదయానికి ఎంతో చేరువయినా చిత్రం, ఎందుకంటే ఇది తన తండ్రి 150వ చిత్రం అని, ఫాన్స్ నుండి వచ్చిన ఈ అనూహ్య స్పందన తననెంతో ఆనందపరిచింది, ఫాన్స్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఖైదీ నెంబర్ 150, తమిళ్ బ్లాక్బస్టర్ కత్తి సినిమా రీమేక్, దర్శకత్వం వహించినవారు వి.వి.వినాయక్. ముఖ్య తారాగణం చిరంజీవి, కాజల్ అగ్గార్వాల్, తరుణ్ అరోరా, బ్రహ్మానందం, అలీ, తదితరులు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు.


No comments

Ads Place