మెగాస్టార్ వెండితెరకు తన 150వ చిత్రం ఖైదీ నెం 150 తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఖైదీ మంచి టాక్ తో సక...
మెగాస్టార్ వెండితెరకు తన 150వ చిత్రం ఖైదీ నెం 150 తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఖైదీ మంచి టాక్ తో సక్సెసఫుల్ గా రన్ అవుతుంది. ఇక తన 151వ చిత్రానికి కూడా ముహూర్తం పెట్టేసాడని సమాచారం.
ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ధ్రువ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తన 151వ చిత్రం చేయబోతున్నారు. ఇటీవలే సూరి చెప్పిన కథ చిరు చరణ్ లకు బాగా నచ్చడంతో దానిని డెవలప్ చేయమని చెప్పారట.
కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం మర్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు నాడే కుటుంబ సభ్యుల సమక్షం లో లాంచ్ చేయనున్నారని సమాచారం.
పూర్తీ స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ లో చిరంజీవి సరి కొత్త లుక్ లో కనిపిస్తారని అంటున్నారు. అలాగే అన్ని ప్లానింగ్ ప్రకారం జరిగితే షూటింగ్ కూడా మే జూన్ నెలల్లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట.



No comments