ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కళను తీసుకురావడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు పసందయినా వినోదపు భోజనం తిన్నట్టుగా ఫీల్ అయిపోయార...
ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కళను తీసుకురావడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు పసందయినా వినోదపు భోజనం తిన్నట్టుగా ఫీల్ అయిపోయారు, దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి చాల ఏళ్ళ తర్వాత నటించిన ఖైదీ నెం 150, నట సింహం బాలకృష్ణ 100వ చిత్రం అయినా గౌతమీపుత్ర శాతకర్ణి, యంగ్ హీరో శర్వానంద్ నటించిన ఫామిలీ ఎంటర్టైనర్ శతమానం భవతి.
ఈ మూడు చిత్రాలు కూడా ఇంకా హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి. అయితే వీటిల్లో ఇప్పటివరకు చిరు సినిమాకే ఎక్కువ వసూళ్లు వచ్చాయి, కానీ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది మాత్రం ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అయితే నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం కుండా బద్దలుకొట్టేసాడు. ముందుగా చిరంజీవి ఖైదీ నెం 150 గురించి మాట్లాడుతూ బాస్ ఐస్ బ్యాక్ అంటూ వోచిన సినిమా చాల బాగుంది కానీ అది తమిళ సినిమా రీమేక్ కత్తి అని చెప్పకుంటే ఇంకా బాగుండేది అని అన్నారు తమ్మారెడ్డి. సినిమాకు వస్తున్నా కలెక్షన్స్ సూపర్బ్ అంటూనే ఎంతయినా మెగాస్టార్ ఎప్పటికి మెగాస్టారే అంటూ పొగిడేసాడు.
ఇక బాలయ్య శాతకర్ణి గురించి మాట్లాడుతూ శాతకర్ణి ట్రైలర్ చూసి భలే ఉంది అనిపించింది, ఈ సినిమా హిట్ అవుతుంది అనుకున్న కానీ సూపర్ హిట్ అవుతుంది అని అనుకొలెదు అన్నాడు. ఇక బాలయ్య నటన, క్రిష్ డైరెక్షన్, కెమరామెన్ పనితనం అన్ని చూసి తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయిందన్నారు. ముందుగా అనుకున్నట్టుగానే చిరంజీవి బాలయ్య సినిమాలు 100 కోట్ల క్లబ్ ని టచ్ చేయడం చాల ఆనందంగా ఉందని, ఇద్దరికీ బెస్ట్ విషెష్ అందించారు.
ఇక చిన్న సినిమాగా వచ్చిన శతమానం భవతి కూడా పెద్ద హిట్ అయింది అన్న తమ్మారెడ్డి, ఈ ముగ్గురిలో సంక్రాంతి విన్నర్ ఎవరు అని అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పకుండానే తపించుకున్నారు. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఈ సంక్రాంతి మెగాస్టార్ ది అని అనుకుంటున్నారు ఫిలింనగర్ జనాలు.



No comments