మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది ఏళ్ళ తర్వాత ఖైదీ నెంబర్ 150 తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మెగా అభిమానులను అంచనాలను అందుకున్నాడు. విడుదల మొదటి రోజ...
మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది ఏళ్ళ తర్వాత ఖైదీ నెంబర్ 150 తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మెగా అభిమానులను అంచనాలను అందుకున్నాడు. విడుదల మొదటి రోజు నుండే రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేసాడు. నాన్ బాహుబలి రికార్డ్స్ సయితం బద్దలు కొట్టి మెగాస్టార్ ఎప్పటికి మెగాస్టారే అనిపించుకున్నాడు.
తొమ్మిదేళ్ళ తర్వాత కూడా తనపై అభిమానం పెట్టుకున్న అభిమానులకు థాంక్స్ చెప్పాలని చిరంజీవి అభిమానులకోసం థాంక్స్ మీట్ తో కలవబోతున్నారు. కొన్ని రోజులుగా ఈ వేదిక వైజాగ్ లేదా హైదరాబాద్ లో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ చివరకు హైదరాబాద్ లో నే ఈ మెగా థాంక్స్ మీట్ ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారు.
అయితే థాంక్స్ మీట్ పై మెగా ఫామిలీ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతం లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అంతగా సక్సెస్ కాకపోవడం తో, ఈ మెగా థాంక్స్ మీట్ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు.



No comments