రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి మెగాస్టార్ దాదాపు సైలెంట్ అయిపోయారు. ఫామిలీ వ్యవహారాలు తన సినిమా వ్యవహారాలు తప్ప పెద్దగా పార్టీలు మీట...
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి మెగాస్టార్ దాదాపు సైలెంట్ అయిపోయారు. ఫామిలీ వ్యవహారాలు తన సినిమా వ్యవహారాలు తప్ప పెద్దగా పార్టీలు మీటింగులు అనే వాటికి దూరం అయిపోయారు.
ఇప్పుడు టేబుల్ టర్న్ అయింది. ఖైదీ నెం 150 సూపర్ హిట్ కావడం తో మెగాస్టార్ లో జోష్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. దీనికి తోడు పొలిటికల్ ఎక్కులేషన్ లో కూడా మారుతున్నాయి.
అందుకే ఇప్పుడు మళ్ళి తన స్నేహాలు పార్టీలు అన్ని దగ్గర చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న కళాబంధు సుబ్బి రమి రెడ్డి పార్టీ అయిపొయింది. సిటీ సెలెబ్రిటీలు సినీ సెలెబ్రిటీలు బిజినెస్ సర్కిల్ జనాలు అందరు మెగాస్టార్ తో ముచ్చటించారు.
నిన్నటికినిన్న మెగాస్టార్ తోడల్లుడు డాక్టర్ గారు పార్టీ ఇచ్చేసారు. మళ్ళి సెలెబ్రిటీలు సరదాలు మామూలే. ఇక ఇవ్వాలో రేపో అల్లు అరవింద్ కూడా పార్టీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.
వీటన్నిటికిమించి దర్శకుడు దాసరి నారాయణ రావు ఒక పార్టీ హోస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అది కచ్చితంగా విశేషమే. ఎందుకంటే దాసరి అంటే ఇటు కాపు కమ్యూనిటీ అటు పొలిటికల్ వ్యవహారాలు ఇలా ఒకటేమిటి చాల ఉన్నాయి.
మొత్తం మీద చిరంజీవి పేరు మళ్ళి ఒకసారి లిమేలైట్ లోకి వచ్చేసింది. ఒక మాట మాత్రం అక్షరాలా సత్యం, రారాజు ఎప్పటికి రారాజే...



No comments